ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలం.. ఇంగ్లండ్‌కు షిఫ్ట్ అయిన పాక్ మాజీ కెప్టెన్!
- టెస్టు జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ అహ్మద్
- భార్యా పిల్లలతో కలిసి యూకే షిఫ్ట్ అయినట్టు వార్తలు
- ఇలాంటి వార్తలు వినాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన
ఈ ఘోర ప్రదర్శన తర్వాత సర్ఫరాజ్ తన భార్య, పిల్లలను తీసుకుని యూకేకు వెళ్లిపోయినట్టు వార్తలు షికారు చేశాయి. ఈ పుకార్లపై ఓ ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ మాట్లాడుతూ పాకిస్థాన్‌ను విడిచిపెట్టాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ తన మనసులోకి రాలేదని చెప్పుకొచ్చాడు. ఆ వార్తలు శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పాడు. ఇలాంటి పుకార్లు ప్రచారం చేయడానికి ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని హితవు పలికాడు. ఇలాంటి వార్తలు వినాల్సి రావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.