ప్రముఖ గాయని చిత్రపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్
- జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం
- ప్రతి ఒక్కరూ శ్రీరామ కీర్తనలు ఆలపించాలన్న చిత్ర
- ఇళ్లలో 5 ప్రమిదలు వెలగించాలని వీడియో సందేశం
- సోషల్ మీడియాలో చిత్రపై విరుచుకుపడుతున్న ఓ వర్గం వారు
చిత్ర విడుదల చేసిన ఆ వీడియో వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వర్గం వారు చిత్రను లక్ష్యంగా చేసుకుని, ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులుగా చిత్రపై ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది.
అయితే చిత్రకు కేరళ అధికార పక్షం సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ మద్దతుగా నిలిచాయి. సినీ గాయకులు, రచయితలు కూడా చిత్రకు సంఘీభావం ప్రకటించారు.