మూడో రోజు కూడా 'గుంటూరు కారం' కలెక్షన్ల జోరు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడో రోజు కూడా 'గుంటూరు కారం' కలెక్షన్ల జోరు

Guntur Kaaram three days collections details
  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో 'గుంటూరు' కారం
  • తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్
  • రెండ్రోజుల్లో రూ.127 కోట్ల గ్రాస్ వసూలు
  • మూడో రోజు రూ.37 కోట్లు రాబట్టిన 'గుంటూరు కారం'
మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' చిత్రం కలెక్షన్ల జోరు ప్రదర్శిస్తోంది. ఈ సినిమాకు తొలి షో నుంచే నెగెటివ్ రివ్యూలు వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం తగ్గలేదు. మొదటి రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.127 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'గుంటూరు కారం'... మూడో రోజూ కూడా అదే ఊపు కనబర్చింది. నిన్న ఒక్కరోజే రూ.37 కోట్ల గ్రాస్ రాబట్టింది. 

మొత్తమ్మీద ఈ మూడ్రోజుల్లో మహేశ్ బాబు సినిమా రూ.164 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర  నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న 'గుంటూరు కారం' చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఇందులో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది.
Advertisement
Guntur Kaaram
Collections
Mahesh Babu
Trivikram Srinivas
Sankranti
Andhra Pradesh

More Telugu News