టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి

Rishabh Pant sister engagement held in grand style
  • త్వరలో రిషబ్ పంత్ సోదరి వివాహం
  • అంకిత్ చౌదరితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సాక్షి పంత్
  • నిన్న ఘనంగా నిశ్చితార్థం
  • సోదరి ఎంగేజ్ మెంట్ ఫొటోలు పంచుకున్న రిషబ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2022లో రోడ్డు ప్రమాదానికి గురై గత ఏడాది కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఈ డాషింగ్ ఆటగాడు ఐపీఎల్ తో మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. 

కాగా, రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ త్వరలో పెళ్లిచేసుకోనుంది. వరుడి పేరు అంకిత్ చౌదరి. సాక్షి పంత్, అంకిత్ చౌదరిల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. సాక్షి పంత్, అంకిత్ చౌదరి గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. 

తన సోదరి నిశ్చితార్థం ఫొటోలను రిషబ్ పంత్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కూడా విచ్చేశాడు.
Advertisement
Rishabh Pant
Sakshi Pant
Engagement
Ankit Chaudhary
Team India

More Telugu News