Advertisement

స్వచ్ఛ సర్వేక్షణ్ లో సత్తా చాటిన సిద్దిపేట.. హరీశ్ రావు హర్షం

Harish rao happy for Siddipet number on in Swachh Sarvekshan
  • జాతీయస్థాయిలో మొదటిస్థానంలో నిలిచిన సిద్దిపేట
  • సిద్దిపేట మరో మైలురాయిని చేరిందన్న హరీశ్ రావు
  • ప్రజల సహకారం... ప్రజాప్రతినిధుల చొరవ, అధికారుల పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్య
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సిద్దిపేట సత్తా చాటింది. జాతీయస్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. సిద్దిపేట అగ్రస్థానంలో నిలిచి అవార్డు దక్కించుకోవడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి కీర్తిపతాకలో సిద్దిపేట మరో మైలురాయిని చేరిందని ప్రశంసించారు. అవార్డులు అంటేనే సిద్దిపేట... సిద్దిపేట అంటే అవార్డులు అని మరోసారి రుజువైందన్నారు. ప్రజల సహకారం, ప్రజాప్రతినిధుల చొరవ, అధికారుల పనితీరుకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు.
Advertisement
Harish Rao
Siddipet District

More Telugu News