Sofa: ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న సోఫా వాహనం... వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra shares Sofa vehicle video
షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియాలో ఏ ఆసక్తికరమైన అంశం దర్శనమిచ్చినా అది ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిని దాటిపోదంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాతో అంతగా ఆయన మమేకం అవుతారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. 

అందులో ఇద్దరు వ్యక్తులు గ్యారేజిలో సోఫాపై కూర్చుని ఉండడం కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఆ సోఫా గ్యారేజిలోంచి బయటికి వచ్చి రోడ్డుపై రివ్వున దూసుకెళుతుంది. రోడ్డుపై ఇతర వాహనాల్లానే ఆ సోఫా కూడా ప్రయాణిస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తులు సోఫాపై కూర్చుని ఎక్కడెక్కడికో ప్రయాణిస్తారు. అంతేకాదు, ఆ సోఫా వాహనం మేకింగ్ ను కూడా ఆ వీడియోలో చూడొచ్చు. 

దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. "చూడ్డానికి ఇది సరదా ప్రాజెక్టులానే అనిపిస్తుంది. కానీ ఇందులో వాళ్ల కుతూహలం, ఇంజినీరింగ్ పనితనాన్ని చూడండి. ఆటోమొబైల్ రంగంలో ఏ దేశమైనా గొప్పగా ఎదగాలంటే ఇలాంటి గ్యారేజ్ శాస్త్రవేత్తలు అవసరం. ఇలాంటి వాహనం రిజిస్ట్రేషన్ కు వెళ్లినప్పుడు ఆర్టీవో ఇన్ స్పెక్టర్ ముఖం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Sofa
Vehicle
Anand Mahindra
Video
Social Media

More Telugu News