తెలంగాణలో నేడు మరో ఎనిమిది కరోనా కేసుల నమోదు
- కొవిడ్‌కు సంబంధించి బులెటిన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ
- ప్రస్తుతం 59 మంది కొవిడ్ చికిత్సను పొందుతున్నట్లు వెల్లడి
- ఈ రోజు 1,333 మందికి కరోనా పరీక్షల నిర్వహణ
ఇక, తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు (మహమ్మారి ప్రారంభం నుంచి) కరోనా కేసుల సంఖ్య 8,44,566కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు 8,40,396 మంది కొవిడ్ నుంచి బయటపడగా... గత ఇరవై నాలుగు గంటల్లో మరో నలుగురు కోలుకున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా రాష్ట్రంలో 4,111 మంది మృత్యువాతపడ్డారు.