Dhoni: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ ప్రచారంపై చెన్నై సూపర్ కింగ్స్ జవాబు ఇదే..!

Do Not Know About Dhoni Future Plans Says CSK Ceo
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవలే మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ధోనీ.. పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడని సమాచారం. మరో మూడు నెలల్లో ఐపీఎల్ 17 వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తి కాగా.. మరో పది పదిహేను రోజుల్లో ప్రాక్టీస్ మొదలు పెట్టేందుకు అన్ని జట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ధోనీ ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కు సారథ్యం వహిస్తాడా.. ఆడతాడా లేదా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని, ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. 

ఈ ప్రచారంపై సీఎస్కే జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ను మీడియా సంప్రదించగా ఆయన కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. సీఎస్కే జట్టుకు ప్రస్తుతం కెప్టెన్ ధోనీయేనని జవాబిచ్చారు. ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో ప్రస్తుతం ధోనీ విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పారు. జిమ్ లో వర్కౌట్లు చేస్తూ ఫిట్ నెస్ కాపాడుకుంటున్నాడని, పది పదిహేను రోజుల్లో నెట్ ప్రాక్టీస్‌ మొదలుపెడతాడని విశ్వనాథన్‌ చెప్పారు. అయితే, వచ్చే సీజన్ లో ఆడడంపై ధోనీతో చర్చించలేదని, ఈ విషయంపై ధోనేయే జవాబు చెప్పగలడని వివరించారు.
Go Back to Shorts
Dhoni
CSK
IPL 2024
CSK CEO
MS Dhoni

More Telugu News