KTR: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశ పడవద్దు: పార్టీ శ్రేణులతో కేటీఆర్

KTR meeting with Hyderabad brs cadre
షార్ట్స్‌లో చూడండి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పని చేసి తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిచే విధంగా ముందుకు సాగుదామన్నారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్‌ కార్పొరేటర్లతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్ఠంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఏమాత్రం నిరాశపడవద్దని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
KTR
Hyderabad
BRS
Lok Sabha

More Telugu News