అసాధారణ రికార్డులతో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
- టీ20 ఫార్మాట్‌లో 4 సెంచరీలు సాధించిన మూడవ ఆటగాడిగా నిలిచిన సూర్య
- మూడవ టీ20లో సెంచరీతో రోహిత్ శర్మ, గ్లేన్ మ్యాక్స్‌వెల్ సరసన నిలిచిన ‘మిస్టర్ 360’
- నాలుగు వేర్వేరు దేశాల్లో సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచిన సూర్య
దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు పడ్డాయి. టీ20లలో అత్యధిక స్కోరు సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా సూర్య నిలిచాడు. ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడం మరో రికార్డుగా ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇండియా, తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా ‘మిస్టర్ 360’ నిలిచాడు. మాక్స్‌వెల్ సెంచరీల్లో రెండు భారత్‌లో, శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో ఒక్కోటి చొప్పున బాదాడు. ఇక రోహిత్ ఇండియాలో 3, ఇంగ్లండ్‌లో 1 సెంచరీ కొట్టాడు.
కాగా దక్షిణాఫ్రికాపై 3వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 56 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మొదటి అర్ధసెంచరీ సాధించడానికి 32 బంతులు ఆడిన సూర్య ఆ తర్వాత 23 బంతుల్లోనే రెండవ అర్ధసెంచరీని నమోదు చేయడం గమనార్హం.