Karachi Bakery: రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో పేలుడు

Cylinder blast in Rajendra Nagar Karachi bakery
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని కరాచీ బేకరీలో పేలుడు సంభవించింది. బేకరీలోని సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బేకరీలోని పరిస్థితి దారుణంగా తయారయింది. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Go Back to Shorts
Karachi Bakery
Hyderabad
Rajendra Nagar

More Telugu News