Nithin: సరైన జోడీగా మార్కులు కొట్టేసిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్'

  • వక్కంతం వంశీ నుంచి 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్'
  • నితిన్ సరసన సందడి చేయనున్న శ్రీలీల
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న రాజశేఖర్ 
  • హిట్ ఖాయమంటున్న నితిన్ ఫ్యాన్స్

Extra Ordinary Man Movie Update

నితిన్ - వక్కంతం వంశీ దర్శకత్వంలో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్' సినిమా రూపొందింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ రోజునే. భారీ అంచనాల మధ్య ఈ రోజునే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కథ నచ్చడంతో నితిన్ తన సొంత బ్యానర్లో నిర్మించాడు. పాటలను చాలా వరకూ విదేశాల్లో చిత్రీకరించారు. 

ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నాడు. అందువలన ముందుగా ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్ ను కూడా పరిశీలించారు. ఆ తరువాత 'ఎక్స్ట్రా' టైటిల్ ను సెట్ చేశారు. నితిన్ జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ చూడగానే ఈ జోడీ బాగా కుదిరిందనే టాక్ వచ్చింది. సినిమాపై ఆసక్తిని పెంచింది. 

ఇక ఇంతవరకూ హీరోగా మాత్రమే చేస్తూ వచ్చిన రాజశేఖర్, ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రను చేయడం అదనపు ఆకర్షణగా మారింది. నితిన్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉండగా, శ్రీలీల మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. హారీస్ జైరాజ్ బాణీలు ఇప్పటికే యూత్ లో నానుతున్నాయి. ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ ఇస్తుందనే బలమైన నమ్మకంతో నితిన్ ఉన్నాడు. 

  • Loading...

More Telugu News