ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై దూసుకుపోతున్న 'భగవంత్ కేసరి' .. 'లియో'

Bhagavanth Kesari and Leo Movie OTT Response
  • భారీ విజయాన్ని అందుకున్న 'భగవంత్ కేసరి'
  • రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ కి వెళ్లిన కంటెంట్ 
  • అటువైపు నుంచి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ 
  • 'నెట్ ఫ్లిక్స్'లో దూసుకుపోతున్న 'లియో'

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఇప్పుడు రెండు సౌత్ సినిమాలు ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఇకటి 'భగవంత్ కేసరి' అయితే, రెండవది 'లియో'. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' రూపొందింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, బాలకృష్ణ - శ్రీలీల తండ్రీ కూతుళ్లుగా నటించారు. అక్టోబర్ 19న థియేటర్లకు వచ్చింది. అనిల్ రావిపూడి ఈ కథను యాక్షన్ తో కూడిన ఎమోషన్స్ తో నడిపించాడు. బాలయ్య పాత్రకి కాజల్ కాంబినేషన్లో కామెడీ టచ్ ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. కంటెంట్ లోని ఎమోషన్స్ ఇందుకు కారణమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తమిళంలో విజయ్ చేసిన 'లియో' కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఒక రేంజ్ లో పరిగెడుతోంది. లోకేశ్ కనగరాజ్ ట్రీట్మెంట్ .. భారీతారాగణం .. నిర్మాణ విలువలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇటీవలే 'నెట్ ఫ్లిక్స్'కి వచ్చిన ఈ సినిమాకి, యూత్ నుంచి మంచి రెస్పాన్స్ ను రాబడుతున్నట్టుగా చెబుతున్నారు. సౌత్ నుంచి ఓటీటీ సెంటర్స్ కి వెళ్లిన కంటెంట్ అక్కడ తన సత్తాను చాటుకుంటూ ఉండటం విశేషం. 
Go Back to Shorts
Balakrishna
Kajal Agarwal
Sreeleela
Vijay
Trisha

More Telugu News