టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు బీసీసీఐ ఆఫర్!
- కాంట్రాక్ట్ పొడిగింపునకు బీసీసీఐ మరోసారి సంప్రదించినట్టుగా రిపోర్టులు
- ప్రస్తుతానికి ద్రావిడ్ నుంచి స్పందన రాలేదని సమాచారం
- ద్రావిడ్ సుముఖత వ్యక్తం చేయకపోతే వీవీఎస్ లక్ష్మణ్‌కే అవకాశం!
జట్టు కోసం ద్రావిడ్ ఏర్పాటు చేసిన విధానాన్ని కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తాజాగా మరోసారి సంప్రదించినట్టు ‘ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో’ రిపోర్ట్ పేర్కొంది. అయితే ద్రావిడ్ ఇంకా స్పందించలేదని తెలిపింది. ఒకవేళ ద్రావిడ్ నుంచి సానుకూల స్పందన లేకుంటే ప్రస్తుతం ఎన్‌సీఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ) చీఫ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరి కోసం బీసీసీఐ కాంట్రాక్ట్ పత్రాలను సిద్ధం చేసిందని మరొక రిపోర్ట్ పేర్కొంది. కాగా ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాతో ఉన్నాడు. కాంట్రాక్ట్ పొడిగింపునకు రాహుల్ ద్రావిడ్ అంగీకరించకపోతే లక్ష్మణ్ ప్రధాన పోటీదారుగా ఉంటాడు.