జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి: లోకేశ్
- కోనసీమ జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర
- ఆక్వా రైతులతో లోకేశ్ సమావేశం
- లోకేశ్ కు వినతిపత్రం సమర్పించిన ఆక్వా సాగుదారులు
టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని.... సీడ్, ఫీడ్, కరెంటు చార్జీలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
కాగా, లోకేశ్ యువగళం నేడు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కొన్నిరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు టీడీపీలో చేరగా, వారికి లోకేశ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. భట్నవల్లిలో లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు.