పులివెందుల టీడీపీ ఇన్ఛార్జీ బీటెక్ రవిని కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

Police produced TDP Pulivendula incharge BTech Ravi in Kadapa Court
మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ బీటెక్ రవిని కడప కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఆయన రిమాండ్ గడువు ముగియడంతో కోర్టుకు తీసుకువచ్చారు. ఈ నెల 14న బీటెక్ రవిని వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బీటెక్ రవి అరెస్ట్ వివరాల్లోకి వెళ్తే... నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఆ సందర్భంగా లోకేశ్ కు స్వాగతం పలికేందుకు బీటెక్ రవి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. విమానాశ్రయంలోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Go Back to Shorts
BTech Ravi
Telugudesam
Kadapa
Court

More Telugu News