మరో స్టార్ క్రికెటర్ ఐపీఎల్-2024కు దూరం!
- ఐపీఎల్-2024లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడబోనన్న జో రూట్
- టెస్టు మ్యాచులపై దృష్టి పెట్టేందుకు వీలుగా నిర్ణయం
- రాజస్థాన్ రాయల్స్ ప్రకటన, అతడు జట్టుకు ఎంతో ఇచ్చాడని కామెంట్
‘‘చర్చల సందర్భంగా జో తన నిర్ణయాన్ని మాకు చెప్పాడు. ఐపీఎల్-2024లో ఆడనని పేర్కొన్నాడు. జట్టుతో తక్కువ సమయమే ఉన్నా సభ్యులపై అతడు ఎంతో సానుకూల ప్రభావం చూపించాడు’’ అని జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కర తెలిపాడు.
కాగా, జో రూట్ రాక జట్టులోకి యువ క్రీడాకారులకు ఎంతో లాభించిందని రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక డిసెంబర్ 19న జరగనున్న ఆక్షన్‌లో మంచి బ్యాటర్లను సొంతం చేసుకునేందుకు జట్టు ప్రయత్నిస్తోంది.