చిరిగిన బూట్లతో సల్మాన్ ఖాన్ ‘టైగర్-3’ మూవీకి ప్రచారం!
- టైగర్-3 మూవీ ప్రచారంలో పాత బూట్లు ధరించిన సల్మాన్ ఖాన్
- నెట్టింట ఫొటోలు వైరల్
- నటుడి సింప్లిసిటీ చూసి అభిమానులు, నెటిజన్ల ప్రశంసలు
ఇటీవల టైగర్-3 మూవీతో భారీ విజయాన్ని అందుకున్న సల్మాన్ మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయగర్వం తలకెక్కకుండా జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించడమే తన లక్ష్యమని చెప్పాడు. ప్రజాభిమానం కూడా పొందడం తనకు దక్కిన అదృష్టమని వ్యాఖ్యానించాడు.