బాలీవుడ్ లో తనకు పోటీ ఎవరనే దానిపై కత్రినా కైఫ్ స్పందన
- కత్రినా బాలీవుడ్ లో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి
- తాను ఏం కోరుకున్నానో దాన్ని సాధించానన్న కత్రినా
- బాలీవుడ్ లో తనకు తానే పోటీ అని వ్యాఖ్య
తన సుదీర్ఘమైన కెరీర్ లో సాధించిన విజయాల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు తాను ఏం కోరుకున్నానో దాన్ని సాధించానని తెలిపారు. ప్రతి చిత్రంలో కొత్త విషయాలను నేర్చుకుంటూ నటిగా పరిణతి సాధించానని చెప్పారు. తన ప్రయాణం ఒక కలలా గడిచిపోయిందని అన్నారు. తన కెరీర్ లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. ఇండస్ట్రీలో పోటీ ఉంటుందని, అయితే ఆ పోటీ గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదని... తనకు తానే పోటీ అని అన్నారు. భవిష్యత్ లో ఛాలెంజింగ్ రోల్స్ ను చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు.