ఓటీటీలో గురు .. శుక్రవారాల్లో జరిగే రచ్చ ఒక రేంజ్ లో ఉందే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటీటీలో గురు .. శుక్రవారాల్లో జరిగే రచ్చ ఒక రేంజ్ లో ఉందే!

This week OTT movies and series
  • ఈ నెల 23న నెట్ ఫ్లిక్స్ లో 'పులిమడ'
  • అదే రోజున జియో సినిమాలో 'గుడ్ ఓల్డ్ డేస్'
  • 24వ తేదీన సోనీలివ్ లో మలయాళ మూవీ 'చావెల్'
  • ఈటీవీ విన్ ఫ్లాట్ ఫామ్ పైకి 'ఒడియన్'
  • అమెజాన్ ప్రైమ్ సెంటర్ కి న్యూ సిరీస్ గా 'ది విలేజ్'  

ఈ గురు .. శుక్రవారాల్లో ఓటీటీ ఫ్లాట్ ఫ్లామ్స్ పై సందడి కాస్త గట్టిగానే కనిపిస్తోంది. హాలీవుడ్ ... బాలీవుడ్ సినిమాలు .. వెబ్ సిరీస్ ల సంగతి అలా ఉంచితే, సౌత్ నుంచి కూడా చాలా సిరీస్ లు .. సినిమాలు ఓటీటీ ట్రాక్ పైకి వెళ్లడం కనిపిస్తుంది. గురువారం రోజున మలయాళ మూవీ 'పులిమడ' ప్రేక్షకుల ముందుకు రానుంది. జోజు జార్జ్ - ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన ఈ సినిమా, నెట్ ఫ్లిక్స్ లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజున తెలుగు వెబ్ సిరీస్ 'గుడ్ ఓల్డ్ డేస్' జియో సినిమాలో  స్ట్రీమింగ్ అవుతుంది.శుక్రవారం రోజున సోనీలివ్ లో 'చావెర్' మలయాళ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో కుంచాకో బోబన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన నటించిన సినిమానే ఇది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో ఈ కథ కడుస్తుంది. అదే రోజున మోహన్ లాల్ మూవీ 'ఒడియన్' ఈటీవీ విన్' ద్వారా పలకరించనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలో, మోహన్ లాల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 24వ తేదీనే 'ది విలేజ్' అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది అతీంద్రియశక్తులను టచ్ చేస్తూ సాగే గ్రామీణ నేపథ్యంలోని కథ. ఆర్య జోడీగా దివ్య పిళ్లై నటించిన ఈ సినిమాలో, ఆడుకాలం నరేన్ .. తలై వాసల్ విజయ్ .. ముత్తురామన్ .. పూజ .. జయకుమార్ .. జాన్ కొక్కెన్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఐదు భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Advertisement
Joju George
Kunchako boban
Mohanlal
Arya

More Telugu News