తమ గారాల పట్టి ‘అల్లు అర్హ’ వీడియోను షేర్ చేసిన బన్నీ.. ఇదిగో వీడియో
- తన సంతోషాల సమూహం అర్హ అని వీడియో షేర్ చేసిన ఐకాన్ స్టార్
- డాడీ ముద్దులు పెడుతుంటే సరదాగా దూరం జరిగిన అర్హ
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
చిన్నారి ‘అల్లు అర్హ’ను ముద్దాడుతున్న వీడియోను అల్లు అర్జున్ షేర్ చేశాడు. ‘ నా సంతోషాల సమూహం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. డాడీ ముద్దులు పెడుతుంటే దూరంగా జరుగుతూ, చేతులు అడ్డుపెట్టుకుంటూ వీడియోలో అర్హ కనిపించింది. కూతురిని చూస్తూ అల్లు అర్జున్ మురిసిపోతూ కనిపించాడు. సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్‌లో అర్జున్ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూతురిపట్ల ప్రేమ చూపిస్తున్న తమ అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తండ్రీకూతుళ్ల ప్రేమ చూడముచ్చటగా ఉందని, ఎల్లప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.