Uttar Pradesh: జీన్స్ వేసుకోమంటూ అత్త ఒత్తిడి.. పోలీసులకు కోడలి ఫిర్యాదు

UP woman approaches police after mother in law pressurizes into wearing jeans
షార్ట్స్‌లో చూడండి
సాధారణంగా యువతీయువకులు ఆధునిక వస్త్రధారణ వైపే మొగ్గు చూపుతారు. సంప్రదాయక దుస్తులను ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబంలో అత్తాకోడళ్ల మధ్య సీన్ రివర్స్ కావడంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే, హరిపర్వత్‌కు చెందిన ఓ యువకుడికి ఎత్మాద్‌పూర్ పరిధిలో ఉంటున్న యువతితో గతేడాది పెళ్లైంది. అయితే, జీన్స్ ధరించేందుకు అలవాటు పడిపోయిన అత్త తన కోడలిని కూడా జీన్స్ వేసుకోమని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఈ విషయమై వారి మధ్య గొడవలు పతాకస్థాయికి చేరడంతో ఏం చేయాలో తెలియని కోడలు చివరకు ఆగ్రా పోలీసులను ఆశ్రయించింది. ‘‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. నాకు జీన్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు. ఈ విషయం నా భర్తకు చెబితే తిరిగి నన్నే కొడుతున్నారు’’ అని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, వారి మధ్య సమోధ్య కుదిర్చేందుకు తాము కృషి చేస్తున్నట్టు స్థానిక ఏసీపీ తెలిపారు.
Go Back to Shorts
Uttar Pradesh

More Telugu News