నెట్ ఫ్లిక్స్ లోకి అడుగుపెడుతున్న 'లియో' .. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- విజయ్ హీరోగా తెరకెక్కిన 'లియో'
- యాక్షన్ కి పెద్దపీట వేసిన లోకేశ్ కనగరాజ్
- భారీతారాగణం ప్రధానమైన ఆకర్షణ
- ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్
అలాంటి ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వారు ఈ నెల 24వ తేదీ నుంచి భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను వదిలారు. 28వ తేదీ నుంచి గ్లోబల్ లాంచ్ అంటూ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.
విజయ్ సరసన త్రిష నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ .. అర్జున్ .. గౌతమ్ మీనన్ ... మన్సూర్ అలీఖాన్ .. ప్రియా ఆనంద్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. యాక్షన్ పాళ్లు ఎక్కువైపోయిన ఈ సినిమాకి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి మరి.