చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై కవిత ఫైర్
- గతంలో ప్రజా ఉద్యమాన్ని తక్కువ అంచనా వేశామన్న చిదంబరం
- అమరవీరుల చావుకు తమదే బాధ్యత అని వెల్లడి
- తప్పు జరిగిపోయింది క్షమించాలంటూ వ్యాఖ్యలు
- మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదంటూ కవిత ఆగ్రహం
తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. గ్యారెంటీలు ప్రకటించడానికేమో గాంధీలు వస్తారా... క్షమాపణలు చెప్పడానికేమో బంట్రోతులను పంపిస్తారా...? 6 దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ కూడా చెప్పలేరా...? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం. ఈ గడ్డపై జోడో యాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు" అని కవిత తీవ్రస్థాయిలో స్పందించారు.