వరల్డ్ కప్‌ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

Narendra modi to attend world cup as chief guest
షార్ట్స్‌లో చూడండి
ఆహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చారిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారట. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెబుతున్నారు. మోదీతో పాటూ క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని తెలుస్తోంది.
Go Back to Shorts
Narendra Modi
Ind Vs Aus
Cricket

More Telugu News