ఇజ్రాయెల్ అనుమానాలు నిజమే.. ఆసుపత్రిని ఆయుధాల డెన్‌గా మార్చేసిన హమాస్ ఉగ్రవాదులు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇది!
- హమాస్ ఆయుధాగారంగా గాజాలోని అల్‌షిపా ఆసుపత్రి
- ఎమ్మారై భవనంలో కుప్పలు తెప్పలుగా ఆయుధాలు
- ఔషధాలు, ఆయుధాలు ఒక చోటే
- ఎమ్మారై మిషన్ వెనకే ఏకే-47 తుపాకులు
ఇజ్రయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఈ బాగోతాన్ని వీడియో ద్వారా బయటపెట్టింది. 6.59 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఐడీఎప్ అధికారి ఒకరు ఆసుపత్రి మొత్తం తిరుగుతూ ఉగ్రవాదులు ఆయుధాలు ఎక్కడెక్కడ దాచింది సవివరంగా చూపించారు. ర్యాక్‌లలో ఔషధాలతోపాటు ఆయుధాలు, కత్తులు, బులెట్ ప్రూఫ్ జాకెట్లు కనిపించాయి.
ఎమ్మారై గదిలో కంప్యూటర్, కమ్యూనికేషన్ రేడియో, ఫోన్, సీడీలు కూడా ఉన్నాయి. వీటిని విశ్లేషించాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే అది పేరుకే ఆసుపత్రి అని తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఔషధాలకు కొరత ఉందన్న వార్తలను అధికారి గుర్తుచేస్తూ.. అక్కడ ఔషధాలు గుట్టలుగా పడి ఉండడాన్ని చూపించారు. హమాస్ అరాచకాలకు ఇంతకుమించి ఉదాహరణ అవసరం లేదని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి జొనాథన్ కన్రికస్ పేర్కొన్నారు.