దాంపత్య జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దీపికా పదుకొణే
- తాను, రణవీర్ ఇద్దరం బిజీ లైఫ్ ను గడుపుతున్నామన్న దీపిక
- కలిసి గడిపేందుకు సమయం దొరకడం లేదని వెల్లడి
- ఇకపై ఇద్దరి కోసం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నామన్న దీపిక
చిన్న వయసులో తాను ముంబైలో అడుగు పెట్టానని... ఆ రోజుల్లో తనకు రూమ్ కూడా ఉండేది కాదని దీపిక తెలిపింది. అర్ధరాత్రి వరకు పని చేసి క్యాబ్ లోనే నిద్రపోయేదాన్నని చెప్పింది. అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంతో సంతోషం కలుగుతుందని... ఎంతో సాధించాననే చిన్నపాటి గర్వం కలుగుతుందని తెలపింది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తీరిక లేకుండా పని చేస్తూ తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరుచుకున్నానని చెప్పింది.