రోజుకు ఈ మాత్రం నడిస్తే చాలు.. మధుమేహం, గుండెజబ్బుల నుంచి రక్షణ
- రోజుకు 10 వేల అడుగులు నడవాలన్న గత అధ్యయనాలు
- అంత అవసరం లేదన్న స్పెయిన్ యూనివర్సిటీ
- రోజుకు మధ్యస్తంగా 8 వేల అడుగులు నడిస్తే చాలని స్పష్టీకరణ
- అంటే రోజుకు 6.4 కిలోమీటర్లు నడిస్తే మరణాన్ని వాయిదా వేయవచ్చన్న పరిశోధకులు
10 వేల అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉంటామన్న ఉద్దేశంతో కొందరు ఆ నంబరును చేరుకునేందుకు కష్టపడుతున్నారని, అధికబరువు ఉన్న వారికి దీనివల్ల ఇబ్బంది పడడంతోపాటు వారి గుండెపై మరింత ఒత్తిడి పడుతుందని పేర్కొన్నారు. కాబట్టి రోజుకు 2,500 నుంచి 3 వేల అడుగులతో మొదలుపెట్టి క్రమంగా ప్రతి 15 రోజులకు 500 అడుగులు పెంచుకుంటూ పోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని పరిశోధకులు తెలిపారు. అధిక బరువు ఉన్నవారు తొలుత 1000 అడుగులతో మొదలుపెట్టినా సరిపోతుందని పేర్కొన్నారు. ఇక, వృద్ధులైతే మాత్రం తమ శక్తిమేరకు లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం మేలని వివరించారు.