వరల్డ్ కప్ లో నేడు చిట్టచివరి లీగ్ మ్యాచ్... ఒక్క మార్పు లేకుండా బరిలోకి టీమిండియా, నెదర్లాండ్స్ జట్లు

వరల్డ్ కప్ లో నేడు చిట్టచివరి లీగ్ మ్యాచ్... ఒక్క మార్పు లేకుండా బరిలోకి టీమిండియా, నెదర్లాండ్స్ జట్లు

Team India takes on Nederlands in last league match in world cup
  • అక్టోబరు 5న మొదలైన వరల్డ్ కప్
  • నేటితో ముగియనున్న లీగ్ దశ
  • సెమీస్ స్థానాలు ఖరారు
  • నేడు టీమిండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ లాంఛనప్రాయం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
భారత గడ్డపై అక్టోబరు 5న ప్రారంభమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో నేడు చిట్టచివరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో ఆతిథ్య టీమిండియా, నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. టీమిండియా ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 8 విజయాలతో తిరుగులేని రికార్డుతో బరిలో దిగుతోంది. నెదర్లాండ్స్ ఆడిన 8 మ్యాచ్ ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివర ఉంది. 

టీమిండియా ప్రస్తుతం ఉన్న భీకర ఫామ్ ను పరిగణనలోకి తీసుకుంటే నెదర్లాండ్స్ పరిస్థితి ఊహించడం సులభమే. టోర్నీలో ఇప్పటికే సెమీస్ స్థానాలు ఖరారైన నేపథ్యంలో, ఇవాళ్టి మ్యాచ్ లాంఛనప్రాయమే. 

ఈ పోరుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా, నెదర్లాండ్స్ జట్లు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్నాయి.
Advertisement
Team India
Nederlands
Toss
Batting
Bengaluru

More Telugu News