282 మంది ప్రవాసులపై కువైట్ ఉక్కుపాదం
- దేశంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు
- రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 282 మంది అరెస్ట్
- వారిపై చట్టపరమైన చర్యలకు రెడీ అవుతున్న అధికారులు
దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న ప్రవాసులను గుర్తించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు కొనసాగాయి. అరెస్ట్ అయిన వారందరూ రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్టు అధికారులు పేర్కొన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెసిడెన్సీ నిబంధనల సమగ్రతను కాపాడడం, కార్మిక చట్టాల నిబద్ధతను కాపాడేందుకు ఈ తనిఖీలు ఉపయోగపడతాయని వివరించారు.