ఆప్ఘనిస్థాన్ కోచ్ ట్రాట్ విచారం.. కొన్ని అవకాశాలు కోల్పోయామని వ్యాఖ్య
- ఎన్నో లక్ష్యాలతో వన్డే వరల్డ్ కప్‌ను ప్రారంభించామన్న కోచ్ ట్రాట్
- అన్ని మ్యాచులూ గెలిచి ఉంటే బాగుండేదని వ్యాఖ్య
- టీంకు మంచి భవిష్యత్తు ఉందని స్పష్టీకరణ
‘‘ఎన్నో ఆశయాలతో మేం ఇక్కడ కాలుపెట్టాము. నాలుగు మ్యాచులు గెలిచిన మాట వాస్తవమేకానీ, కొన్ని అవకాశాలు కోల్పోయాం. ఆ మ్యాచుల్లోనూ గెలిచి ఉండాల్సింది’’ అని కామెంట్ చేశాడు. బంగ్లాదేశ్‌తో తొలిమ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి దిగ్గజాలను ఓడించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపోయేలా చేసింది.