ఏపీకి జగన్ ఎందుకు కావాలి?: నారా లోకేశ్
- వై ఎపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ కార్యక్రమం
- నేటి నుంచి కార్యక్రమం షురూ
- జగన్ ఎందుకు కావాలని ప్రజలు కూడా అదే అడుగుతున్నారంటూ లోకేశ్ వ్యంగ్యం
జీరో వాడకం... రూ.295 బిల్లు అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపైనా లోకేశ్ స్పందించారు. జనాన్ని క్యాన్సర్ గడ్డలా పట్టి పీడిస్తున్న నువ్వు బిడ్డ ఎలా అవుతావు జగన్? అంటూ ఎత్తిపొడిచారు. "వాహ్... ఒక్క యూనిట్ కూడా వాడని ఇంటికి రూ.295 కరెంటు బిల్లు బాదుడు. సొంత పేపరు, చానల్, సిమెంటు, విద్యుత్ కంపెనీలు, ఊరికో ప్యాలెస్ ఉన్న అవినీతి అనకొండ, పెత్తందారుడు జగన్ పేదలకు రూపాయి స్కీం ఇచ్చి వెయ్యి రూపాయలు దోచే స్కాం" అంటూ ధ్వజమెత్తారు.