మైనంపల్లి పైసల మైనాన్ని ఓటుతో కరిగించాలి: మంత్రి హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మైనంపల్లి పైసల మైనాన్ని ఓటుతో కరిగించాలి: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao hot comments on Mynampalli
  • మైనంపల్లి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం
  • తాను ఆయనలా దిగజారి మాట్లాడలేనన్న హరీశ్ రావు
  • మల్కాజిగిరిలో మంచితనానికి, రౌడీయిజానికి మధ్య పోటీ జరుగుతోందని వ్యాఖ్య
మైనంపల్లి హన్మంతరావు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయనలా తాను దిగజారి మాట్లాడలేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... మల్కాజిగిరిలో మంచితనానికి, రౌడీయిజానికి మధ్య పోటీ జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి పైసల మైనాన్ని ఇక్కడి ప్రజలు తమ ఓటుతో కరిగించాలన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించారన్నారు. కానీ కేసీఆర్ పాలనలో హైదరాబాద్ సహా తెలంగాణ ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. హైదరాబాద్ ఇలాగే ప్రశాంతంగా ఉండాలంటే కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Harish Rao
mynampalli hanmantha rao
BRS
Congress

More Telugu News