దక్షిణాఫ్రికా × ఇండియా మ్యాచ్‌లో ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ ఇతడే!
- ఫీల్డర్ ఆఫ్ ధి మ్యాచ్‌గా రోహిత్ ఎంపిక
- సూర్యకుమార్ యాదవ్‌పై కూడా కోచ్ దిలీప్ ప్రశంసలు
- క్రీడాకారులులే టీమిండియా బలమని వ్యాఖ్య
ఈసారి ఈ మెడల్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దక్కింది. మైదానంలో తన చురుకైన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి పరుగులకు బ్రేకులు వేసిందుకు ఈ మారు ఫీల్డింగ్ మెడల్ రోహిత్‌ను వరించింది. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ టీం సభ్యులు కమిట్మెంట్‌తో ఫీల్డింగ్ చేశారని కితాబునిచ్చాడు. మన బలం టీం సభ్యులేనని వ్యాఖ్యానించాడు. సూర్యకుమార్ కూడా అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడని చెప్పాడు.
ఈసారి వినూత్నంగా ఓ కెమెరా ద్వారా విజేతను ఎంపిక చేశారు. టీం ముందుకు వచ్చిన కెమెరా కాసేపూ అటూఇటూ తిరిగి చివరకు రోహిత్ శర్మను మెడల్‌కు ఎంపిక చేసింది. మెడల్ పొందడం అంటే కేవలం క్యాచ్‌లు పట్టడం, రన్నౌట్ చేయడం కాదని, ఆటపై ఆ క్రీడాకారుడు చూపిన ప్రభావానికి చిహ్నమని టి.దిలీప్ వ్యాఖ్యానించాడు. ఇక, దిలీప్ ఇచ్చే ఈ మెడల్ కోసం టీం సభ్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు.