ప్రపంచకప్‌లో నేడు మరో కీలక మ్యాచ్.. కివీస్‌పై టాస్ గెలిచిన పాకిస్థాన్.. కేన్ మామ రాకతో నూతనోత్సాహంలో న్యూజిలాండ్

Kane Williamson Returns As Pakistan Opted To Bowl
ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో మరో కీలక సమరం జరగబోతోంది. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదిక అయింది.  సెమీస్‌లో చోటు దక్కించుకోవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. వరుస విజయాలతో తొలుత దూకుడు ప్రదర్శించిన న్యూజిలాండ్‌ను ఆ తర్వాత వరుస పరాజయాలు వెక్కిరించగా.. వరుస పరాజయాల తర్వాత పుంజుకున్న పాకిస్థాన్ తిరిగి సెమీస్ రేసులోకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే ఆ జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. కివీస్ గెలిస్తే మూడో స్థానానికి చేరుకుని సెమీస్ బెర్త్‌కు దగ్గరవుతుంది. కాబట్టి ఇరు జట్లకు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గానే చెప్పాలి.

టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేన్ విలియమ్సన్‌ జట్టులోకి రావడంతో ఆ జట్టుకు అదనపు బలం చేకూరినట్టే. కేన్ జట్టులోకి రావడంతో విల్ యంగ్ తప్పుకోగా, మ్యాట్ హెన్రీ స్థానంలో ఇష్ సోది జట్టులోకి వచ్చాడు. ఇక పాకిస్థాన్ ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. ఉస్మాన్ మిర్ స్థానంలో హసన్ అలీని రంగంలోకి దింపింది.
Go Back to Shorts
Pakistan
Team New Zealand
World Cup 2023
Kane Williamson

More Telugu News