శ్రీలంకపై విజయం తర్వాత అభిమానికి బూట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిత్‌శర్మ.. వీడియో ఇదిగో!
- ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపిన రోహిత్
- వీడియోను షేర్ చేసిన ఎక్స్ యూజర్
- ఆదివారం సౌతాఫ్రికాతో తలపడనున్న టీమిండియా
వైరల్ అయిన ఈ వీడియోపై ఓ యూజర్ స్పందిస్తూ.. ఒక్క షూనే ఇచ్చాడా? అని ప్రశ్నించగా.. ‘‘రోహిత్ వెనక్కి వచ్చి రెండో షూ కూడా ఇచ్చేశాడు’’ అని బదులిచ్చాడు. ‘రోహిత్‌శర్మ నిజమైన జెంటిల్మన్.. గొప్ప కెప్టెన్’ అని ఇంకో యూజర్ కామెంట్ చేశాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో రోహిత్ విఫలమైనప్పటికీ జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించిపెట్టాడు. భారత జట్టు ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లోనూ విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఎదుర్కోనుంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది.