మిగతా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోతే పరిస్థితి ఏంటి?.. ఏం జరుగుతుందంటే..

మిగతా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోతే పరిస్థితి ఏంటి?.. ఏం జరుగుతుందంటే..

What Huge Win Over Sri Lanka Means For India in world cup 2023
  • శ్రీలంకపై గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి టీమిండియా
  • మిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోతే 2 లేదా 3వ స్థానానికి దిగజారే ఛాన్స్
  • కీలకమవనున్న ఆస్ట్రేలియా గెలుపు, రన్‌రేట్
రోహిత్ సారధ్యంలోని టీమిండియా వరల్డ్ కప్ 2023లో విజయాల పరంపరను కొనసాగిస్తోంది. మరింత మెరుగైన ఆటతీరును కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటోంది. గురువారం శ్రీలంకపై చరిత్రాత్మక గెలుపుని సొంతం చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 302 పరుగుల తేడాతో గెలిచింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్‌లు అద్భుతంగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత పేస్ దళం మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, బుమ్రా ధాటికి శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. 55 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ వరసగా ఏడవ విజయాన్ని నమోదు చేసింది. 

ఈ అద్భుత గెలుపుతో టీమిండియా వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సెమీ ఫైనల్ బెర్త్‌ని కూడా ఖరారు చేసుకుంది. 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో నిలిచింది. అయితే రన్‌రేట్ విషయంలో దక్షిణాఫ్రికా ( 2.290) భారత్ కంటే మెరుగ్గా ఉంది. ఇక టాప్-4లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

గ్రూప్ దశలో భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. నెదర్లాండ్స్‌పై చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిస్తే అగ్రస్థానంలో నిలబడుతుంది. ఒకవేళ రెండింటిలోనూ ఓడిపోతే మాత్రం 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమీకరణంలో ఆస్ట్రేలియా మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిస్తే భారత్ 3వ స్థానానికి దిగజారే ఛాన్స్ కూడా ఉంది. చెరో 14 పాయింట్లు ఉంటాయి కాబట్టి ఎవరిది ఏ స్థానం అనేది రన్‌రేట్ నిర్ణయించనుంది. ఒకవేళ టీమిండియా ఒక మ్యాచ్‌లో ఓడి, దక్షిణాఫ్రికాకు 2 విజయాలు సాధిస్తే ఇరు జట్లకు అప్పుడు 16 పాయింట్లు ఉంటాయి. రన్‌రేట్ ఆధారంగా ఒకటి, రెండు స్థానాలు ఖరారు కానున్నాయి.
Advertisement
Cricket
Team India
Rohit Sharma
Virat Kohli

More Telugu News