వీవీఎస్ లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలు.. వీడియో షేర్ చేసిన రిషభ్ పంత్

VVS Laxman Birthday Special Rishabh Pant Shares NCA Heads Birthday Celebration Video On Social Media
  • ఎన్సీఏలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలు
  • వేడుకల్లో పాలుపంచుకున్న రిషభ్ పంత్
  • ఈ వీడియోను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పంత్
భారత క్రికెట్ జట్టుకు లభించిన మేటి క్రీడాకారుల్లో వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఒకరు. తెలుగువాడైన లక్ష్మణ్ భారత్‌కు అనేక చిరస్మరణీయమైన విజయాలను అందించారు. ప్రస్తుతం ఆయన నేషనల్ క్రికెట్ అకాడమీకి (ఎన్సీఏ) నేతృత్వం వహిస్తున్నారు. 

ఇక నవంబర్ 1న లక్ష్మణ్ పుట్టిన రోజన్న విషయం క్రికెట్ అభిమానులకు తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఎన్సీఏలో లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కేక్ కట్ చేసి పక్కనే ఉన్న రిషభ్ పంత్‌కు కూడా తినిపించారు. కాగా, ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను పంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే లక్ష్మణ్ సర్’ అంటూ వీడియోకు ఓ కామెంట్ కూడా జత చేశాడు. 

గతేడాది కారు యాక్సిడెంట్‌లో గాయపడ్డ పంత్ ప్రస్తుతం ఎన్సీఏలో తన ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. త్వరలో దేశవాళీ క్రికెట్‌తో పంత్  అరంగేట్రం చేస్తాడని, ఆ తరువాత టీమిండియా తరుపున ఆడతాడని సమాచారం.
Advertisement
VVS Laxman
Rishab Pant
National Cricket Academy

More Telugu News