ప్రముఖ నటుడి కొడుకును ప్రేమ వివాహం చేసుకుంటున్న అర్జున్ కుమార్తె
- తమిళ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతి ప్రేమలో ఐశ్వర్య
- ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇరు కుటుంబాలు
- త్వరలో నిశ్చితార్థ వేడుక
మరోవైపు, ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఐశ్వర్య పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరి ప్రేమ వివాహానికి అర్జున్, తంబి రామయ్య కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఉమాపతి కూడా పలు తమిళ చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని చెపుతున్నారు.
