కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్‌రెడ్డి: మంత్రి హరీశ్ రావు
- నాడు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు తిట్టారన్న హరీశ్ రావు
- ఈ రోజు అమెనే దేవత అంటున్నారని విమర్శలు
- బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని... ప్రజల టీమ్ అన్న హరీశ్ రావు
ఓటుకు నోటు, నోటుకు సీటు అనే వాళ్లు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కర్ణాటక రైతులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామని అక్కడి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని నిలదీశారు.