Devara: 'దేవర'లో మెరవనున్న మరో స్టార్ హీరోయిన్?

Devara Movie Update
షార్ట్స్‌లో చూడండి
కొరటాల శివ ప్లానింగ్ గురించి ఇండస్ట్రీలో అంతా గొప్పగా చెప్పుకుంటారు. ఆయన తాను అనుకున్న సమయానికి పనులను పూర్తి చేస్తూ ఉంటాడని అంటారు. అలాగే 'దేవర' సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చకచకా జరిగిపోతోందని చెబుతున్నారు. సముద్రంతో ముడిపడి కొనసాగే కథ ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. 
 
రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫస్టు పార్టు ముగింపు .. సెకండు పార్టు వరకూ మాట్లాడుకునేలా ఉంటుందని చెబుతున్నారు. ఫస్టు పార్టులో ప్రధానమైన కథానాయికగా జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. డీ గ్లామర్ పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ సినిమా చివర్లో మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ బలంగా వినిస్తోంది. 

 సెకండ్ హీరోయిన్ పాత్ర సెకండ్ పార్టులోను కొనసాగుతుందని చెబుతున్నారు. ఆ పాత్ర కోసం కొంతమంది హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఆ జాబితాలో ఎవరి పేర్లు  ఉన్నాయో .. ఎవరిని ఎంచుకుంటారో చూడాలి మరి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. 
Go Back to Shorts
Devara
Ntr
Janhvi Kapoor
Koratala Siva

More Telugu News