అనారోగ్యంతో వరుణ్ సందేశ్ భార్య.. స్వయంగా వెల్లడించిన నటి

Vithika sheru talks about her health problems
  • స్పాండిలైటిస్, మైగ్రేన్‌తో బాధపడుతున్నట్టు వెల్లడించిన వరుణ్ సందేశ్ భార్య వితిక షేరూ
  • నీడ్లింగ్ చికిత్సతో పరిస్థితి మెరుగైందని వెల్లడి
  • అభిమానులతో ఈ విషయం పంచుకుని కాస్త సాంత్వన పొందినట్టు వ్యాఖ్య
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడు వరుణ్ సందేశ్‌. ప్రస్తుతం అతడికి అవకాశాలు రాక వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటాడు. వరుణ్ భార్య వితికా షేరూ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. సినిమాలకు దూరంగా ఉంటున్నా ఈ జంట ఆ మధ్య బిగ్‌బాస్‌లో కనిపించి అభిమానులను అలరించింది.

అయితే, తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు వితికా షేరూ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది. దీంతో, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాను కొన్ని రోజులుగా స్పాండిలైటిస్, మైగ్రేన్‌తో బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. మైగ్రేన్‌తో విపరీతమైన తలనొప్పి, వెన్నునొప్పి కలుగుతున్నాయని, ఫలితంగా ఏ పనీ చేయలేకపోతున్నానని పేర్కొంది. స్పాండిలైటిస్‌కు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నట్టు కూడా వెల్లడించింది. 

ఇటీవలే నీడ్లింగ్ కూడా చేయించుకున్నట్టు వితిక పేర్కొంది. నీడ్లింగ్‌తో కాస్త రిలీఫ్ రావడంతో ప్రస్తుతం తన పనులు తాను చేసుకోగలిగే స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. రెండు వారాల నుంచి మైగ్రేన్ ఇబ్బంది పెడుతోందని, ఈ రెండింటి కారణంగా సతమతమవుతున్నానని వితిక చెప్పింది. తన బాధను అభిమానులతో పంచుకుంటూ కాస్త రిలీఫ్ పొందుతున్నానని తెలిపింది. వితిక ఆనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Advertisement
Vithika Sheru
Varun Sandesh
Tollywood

More Telugu News