బెన్ స్టోక్స్ పునరాగమనం... సఫారీలపై టాస్ నెగ్గిన ఇంగ్లండ్
Add ap7am to your home Screen

బెన్ స్టోక్స్ పునరాగమనం... సఫారీలపై టాస్ నెగ్గిన ఇంగ్లండ్

England won the toss against South Africa
  • వరల్డ్ కప్ లో నేడు ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ 
గాయం కారణంగా వరల్డ్ కప్ లో పలు మ్యాచ్ లకు దూరమైన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇవాళ ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. గాయం నుంచి కోలుకున్న స్టోక్స్ ఈ మ్యాచ్ ద్వారా బరిలో దిగనున్నాడు. స్టోక్స్ రాకతో ఇంగ్లండ్ జట్టులో ఉత్సాహం ఉరకలేస్తోంది. 

నేడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటిదాకా 3 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లండ్ కేవలం ఒక్క మ్యాచ్ లోనే నెగ్గింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్... ఆ తర్వాత బంగ్లాదేశ్ పై నెగ్గింది. అయితే మూడో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ్టి మ్యాచ్ ఇంగ్లండ్ కు ఎంతో కీలకం. 

మరోవైపు దక్షిణాఫ్రికా 3 మ్యాచ్ లు ఆడి 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Advertisement
World Cup
England
Ben Stokes
South Africa
Wankhede Stadium
Mumbai

More Telugu News