సచిన్ రికార్డ్‌పై కోహ్లీ గురి.. ఈ వరల్డ్ కప్‌లోనే కొట్టేస్తాడా?
- చారిత్రాత్మక రికార్డ్ దిశగా విరాట్ కోహ్లీ
- వన్డేల్లో 48వ శతకం పూర్తి
- మరో సెంచరీ చేస్తే సచిన్ సరసన చోటు
- 2 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డ్ కనుమరుగు
సిక్సర్‌తో సెంచరీ పూర్తీ చేసిన విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక రికార్డ్‌కు మరింత చేరువయ్యాడు. బంగ్లాదేశ్‌పై నమోదు చేసిన శతకం కోహ్లీకి వన్డేల్లో 48వది కాగా.. వన్డేల్లో మరో సెంచరీ నమోదు చేస్తే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సరసన చేరతాడు. క్రికెట్ హిస్టరీలో 100 సెంచరీలు పూర్తి చేసిన ఏకైక ఆటగాడు సచిన్ వన్డేల్లో 49 శతకాలు బాదాడు. ప్రస్తుతం 48 సెంచరీలు చేసిన కోహ్లీ మరో 2 శతకాలు కొడితే ఏకంగా సచిన్ రికార్డు బ్రేక్ అవుతుంది. మరి ఆ అరుదైన రికార్డ్ ఈ వరల్డ్ కప్‌తోనే బ్రేక్ అవుతుందా? మరింత సమయం పడుతుందా? అనేది వేచిచూడాల్సిందే.