గాజా గజగజ... ఇజ్రాయెల్ దాడిలో 2,750 మంది మృతి
Add ap7am to your home Screen

గాజా గజగజ... ఇజ్రాయెల్ దాడిలో 2,750 మంది మృతి

2700 dead 1000 missing under rubbles in Gaza
  • 9,700 మందికి పైగా గాయాలైనట్లు వెల్లడించిన ఆరోగ్య శాఖ
  • శిథిలాల కింద వెయ్యి మంది వరకు ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడి
  • గాజాపై ఇజ్రాయెల్ దాడి ఆపేస్తే బందీలను విడుదల చేస్తామని హమాస్ అల్టిమేటం?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరు పదో రోజుకు చేరుకుంది. తమపై దాడి చేసిన గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర యుద్ధం ప్రకటించింది. దీంతో గాజా నగరం కుప్పకూలుతోంది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో ఇప్పటి వరకు 2,750 మంది ప్రాణాలు కోల్పోయారని, 9,700 మంది గాయాలపాలయ్యారని స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఈ దాడుల నేపథ్యంలో కొంతమందిని కాపాడినట్లు పాలస్తీనా పౌర రక్షణ బృందం తెలిపింది. శిథిలాల కింద వెయ్యి మందికి వరకు ఉన్నట్లు వెల్లడించింది. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడం ఇబ్బందికరంగా మారిందని, అలాగే ఉంచితే కుళ్లిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.

మొదట్లో ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్ దాదాపు 200 మందిని బందీలుగా పట్టుకుంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడి చేస్తోంది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దాడి ఆపేస్తే బందీలను విడుదల చేస్తామని హమాస్ టెర్రరిస్టులు చెప్పినట్లుగా ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే హమాస్ మిలిటెంట్లు దీనిని ధ్రువీకరించలేదు.
Advertisement
israel
gaza

More Telugu News