తన చావును తనే రికార్డు చేసుకున్న మిలిటెంట్.. ఇజ్రాయెల్ సిటీలో ఘటన.. వీడియో ఇదిగో!
- కిబ్బుట్జ్ సూఫాలో హమాస్ మిలిటెంట్ల ఆకృత్యాలు
- పౌరులపై కాల్పులు జరుపుతూ వీడియో తీసిన మిలిటెంట్లు
- కాల్పులు జరిపి మిలిటెంట్లను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ బలగాలు
ఈ కాల్పుల్లో ముందు నడుస్తున్న మిలిటెంట్ కుప్పకూలడం, ఏం జరిగిందో తెలిసేలోగా వీడియో తీస్తున్న మిలిటెంట్ శరీరంలోకి బుల్లెట్లు దిగడం కనిపించింది. దీంతో రెండో మిలిటెంట్ కూడా కుప్పకూలి చనిపోయాడు. తమ ఆకృత్యాలను రికార్డు చేసి రాక్షసానందం పొందాలని చూసిన మిలిటెంట్.. చివరికి తన చావును తనే రికార్డు చేసుకున్నాడు. సదరన్ ఇజ్రాయెల్ లోని కిబ్బుట్జ్ సూఫా సిటీలో చోటుచేసుకుందీ ఘటన.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.