'హాయ్ నాన్న' టీజర్ లాంచ్ ఈవెంట్ రేపే!
- నాని హీరోగా రూపొందుతున్న 'హాయ్ నాన్న'
- తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ
- కెరియర్ పరంగా నానీకి ఇది 30వ సినిమా
- డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. అందువలన ఇక ప్రమోషన్స్ ను మొదలుపెట్టే పనిలో పడ్డారు. రేపు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని 'పార్క్ హయత్' హోటల్లో టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
ఇది తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ. కథానాయికగా మృణాల్ ఠాకూర్ అలరించనున్న ఈ సినిమాలో, శ్రుతి హాసన్ ప్రత్యేకమైన పాత్రను పోషించింది. కెరియర్ పరంగా ఇది నానీకి 30వ సినిమా. దీనికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఆ తరువాత సినిమాను నాని 'దసరా' మేకర్స్ తో చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.