చంద్రబాబుకు మద్దతుగా రేపు హైదరాబాద్‌లో వినూత్న నిరసన.. 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్'
- శనివారం 10.30-11.30 మధ్య నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణిస్తూ నిరసన తెలిపేందుకు నిర్ణయం
- మియాపూర్-ఎల్‌బీనగర్ స్టేషన్ల మధ్య నిరసన కార్యక్రమం నిర్వహణ
- తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా నిరసన
మియాపూర్-ఎల్‌బీ నగర్ మధ్య వీలైనన్ని స్టేషన్లలో నల్ల టీషర్టులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు టీడీపీ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మెట్రో ఏర్పాటు కావడానికి కారణమైన టీడీపీ అధినేతకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.