సుహాస్ అదృష్టవంతుడు: 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ఈవెంటులో మారుతి

Ambajipeta Marrige Band Teaser Released
  • సుహాస్ హీరోగా 'అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు'
  • సందడిగా సాగిన టీజర్ లాంచ్ ఈవెంట్ 
  • సుహాస్ కెరియర్ ల్లో ఇది ట్రేడ్ మార్కన్న మారుతి 
  • దర్శకుడికి మంచి పేరు వస్తుందని వ్యాఖ్య  
మొదటి నుంచి కూడా సుహాస్ వైవిధ్యభరితమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అంబాజీ పేట మ్యారేజి బ్యాండు' సిద్ధమవుతోంది. సుహాస్ - శివాని జంటగా నటించిన ఈ సినిమాకి దుష్యంత్ దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ లాంచ్ ఈవెంటులో పాల్గొన్న దర్శకుడు మారుతి మాట్లాడుతూ .. "టైటిల్ వినగానే నేటివిటీ పరంగా ఎంత లోతుకి వెళ్లారనేది నాకు అర్థమైంది. టీజర్ ను మాత్రమే కాదు .. నేను సినిమా కూడా చూశాను. చాలా బాగా రాసుకున్నాడు .. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమా చూసిన తరువాత మీరు కూడా ఇదే మాట చెబుతారు" అని అన్నాడు. 

"ఒక హీరోకి మంచి కథ దొరకడమే అదృష్టం .. అలాంటి కథ సుహాస్ కి దొరికింది. తాను జోనర్స్ మార్చుకుంటూ .. మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకెళుతున్నాడు. ఈ సినిమా ఆయన కెరియర్ లో ఒక ట్రేడ్ మార్కును సెట్ చేస్తుంది .. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. గీతా ఆర్ట్స్ 2 .. స్వేచ్ఛా క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Advertisement
Suhas
Shivani
Ambajipeta Marrige Band

More Telugu News