‘దేవర’ పార్ట్‌ 2ను ప్రకటించిన కొరటాల శివ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘దేవర’ పార్ట్‌ 2ను ప్రకటించిన కొరటాల శివ

Koratala siva announced two parts for devara movie
  • ‘దేవర’ను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నామన్న దర్శకుడు కొరటాల శివ
  • సినిమాతో కొత్త ప్రపంచం పరిచయం చేస్తున్నందుకే రెండు పార్టులు అవసరమయ్యాయని వెల్లడి
  • ఒక్క సంభాషణ, ఒక్క సన్నివేశాన్ని కూడా కట్ చేయలేమని వ్యాఖ్య
ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఊహించని సర్‌‌ప్రైజ్ ఇచ్చారు. యంగ్ టైగర్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు తాజాగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రానుందని మరోసారి గుర్తు చేశారు. సినిమాలో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నందున రెండు భాగాలుగా తీయాల్సి వస్తోందని చెప్పారు. 

‘‘ ‘దేవర’ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది కావడంతో కథ విషయంలో ఎన్టీఆర్ సహా మేమంతా ఉద్వేగానికి లోనయ్యాం. ఇందులో బలమైన పాత్రలెన్నో ఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా చిత్రీకరణ ప్రారంభించిన తరువాత ఆ ప్రపంచం రోజురోజుకూ పెద్దదైపోయింది. కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ ఔట్‌పుట్‌తో మాలో రెట్టింపు ఉత్సాహం కలిగింది. నిడివిని దృష్టిలో పెట్టుకుని ఒక్క సన్నివేశం, ఒక్క సంభాషణ కూడా తొలగించలేమని అంతా ఫీలయ్యాం. ఒక్క పార్ట్‌లో ఇంత పెద్దకథను ముగించేయడం తప్పు అన్న నిర్ణయానికి వచ్చాం. పాత్రలు, వాటి భావోద్వేగాలను పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క పార్ట్‌లో కుదరదనుకున్నా. అందరితో చర్చించి పార్ట్ 2 నిర్ణయం తీసుకున్నా’’ అని వివరించారు. 

అంతగా అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంతం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ చిత్రంతో తొలిసారిగా దక్షిణాదిలో కాలుపెడుతోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
Advertisement
Devara
Junior NTR
Koratala Siva

More Telugu News